close

తాజా వార్తలు

ఏపీలో ఇసుక అక్రమంగాతరలిస్తే రెండేళ్ల జైలు

కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని

అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడతామని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధించాలనే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందన్నారు. వారం రోజుల్లో ఇసుక డిమాండ్‌ను గుర్తించి సరిపడా సరఫరా చేస్తమని చెప్పారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆ నిర్ణయాలను పేర్ని నాని మీడియాకు వివరించారు. మొక్కజొన్న ధరలు పడిపోతుండటంపైనా కేబినెట్‌లో చర్చ జరిగిందని చెప్పారు. వారం క్రితం క్వింటాలు ధర రూ.2,200 ఉండేదని.. ప్రస్తుతం రూ.1500కు పడిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమావేశంలో ప్రస్తావించారని.. దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారన్నారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని.. రైతులకు నష్టం రాకుండా కొనుగోళ్లు జరపాలని మార్కెటింగ్‌ శాఖను జగన్‌ ఆదేశించారని చెప్పారు. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారన్నారు.

రాష్ట్రంలో పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్ని నాని తెలిపారు. చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు వైఎస్‌ఆర్‌ భరోసా కింద రూ.10లక్షల సాయం అందిస్తామని చెప్పారు. అన్నీ సవ్యంగా ఉంటే అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తామన్నారు. 30 అడుగుల రోడ్డు ఉన్న లేఅవుట్లకు మాత్రమే క్రమబద్ధీకరణ అనుమతివ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. 2019 ఆగస్టులోపు రిజిస్ట్రేషన్‌ జరిగిన వాటికి క్రమబద్ధీకరణ వర్తింపజేయనున్నట్లు చెప్పారు. ఏపీ సోలార్‌, విండ్‌ పవర్‌ పాలసీల సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని పేర్ని నాని వివరించారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.