
తాజా వార్తలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని ఛాంబర్లో ఇన్ఛార్జ్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గగుడి అర్చకులు సాహ్నికి ఆశీర్వచనాలు అందించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. సీఎస్‌గా తనను నియమించడం ఎంతో సంతోషంగా ఉందని నీలం సాహ్ని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా బృందస్ఫూర్తితో పనిచేసి సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేస్తామని సాహ్ని చెప్పారు.
సీఎం జగన్‌తో భేటీ
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం జగన్‌తో సీఎస్ నీలం సాహ్ని భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. సీఎస్‌గా అవకాశం కల్పించినందుకు నీలం సాహ్ని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
