
తాజా వార్తలు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఆయనతో సమావేశమై పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల విస్తరణపై చర్చించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రైల్వే స్టేషన్ల వద్ద పలు రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పించాలని కోరారు.
నడికుడి మార్గాన్ని డబ్లింగ్ లైన్ చేయాలని, ఎంఎంటీఎస్‌ను యాదగిరిగుట్ట మీదుగా జనగామ వరకు పొడిగించాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. చిట్యాల-సిరిపురం రైల్వే స్టేషన్ల మధ్య గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట రైల్వే స్టేషన్లో పునర్ నిర్మాణ పనులు చేపట్టాలని.. చెన్నై, శబరి, కోవ, డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను నిలుపుదల చేయాలని కోరారు. జనగామ రైల్వేస్టేషన్లో నాందేడ్, చార్మినార్, ఎన్ఎస్ఎల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని.. ప్లాట్ ఫాం నంబర్ 3లో సౌకర్యాలు కల్పించాలన్నారు. భువనగిరి రైల్వేస్టేషన్లో శాతవాహన, పద్మావతి, కోణార్క్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని, ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని జీఎంకు కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జీఎం.. వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
