
తాజా వార్తలు
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రశ్న
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. సీఎం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని నరేశ్ అనే కార్మికుడు లేఖలో పేర్కొన్నా.. పోలీసులు ఎందుకు కేసీఆర్పై కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటే నైతికత.. భాజపాలో చేర్చుకుంటే మాత్రం అనైతికతా? అని ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్యేలు భాజపాతో టచ్లో ఉన్నారని చెబితే గులాబీ నేతలు ఉలిక్కిపడుతున్నారని రాంచందర్రావు ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారికి భాజపా అండగా ఉంటుందని ఆయన ధైర్యం చెప్పారు.
Tags :