
తాజా వార్తలు
శ్రీకాకుళం (కలెక్టరేట్): ఇసుక విషయంలో తాను అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఒక్క రూపాయి అయినా తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించినా మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కల్లేపల్లిలోని ఇసుక వారోత్సవాల్లో భాగంగా శనివారం ఇసుక రీచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తుంటే ప్రతిపక్ష నేతలు చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తన అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జె.నివాస్, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
