
తాజా వార్తలు
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని అధిష్ఠానం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. నవంబర్ 30న ‘భారత్ బచావో’ పేరిట దిల్లీలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ వార్‌రూమ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
దేశ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని, నిరుద్యోగం పెరుగుతోందని, వీటిపై ప్రజలకు భాజపా సమాధానం చెప్పకుండా దేశ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దిల్లీ కంటే ముందు అన్ని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేయాలని పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి 1200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవుతారని, ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది కార్యకర్తలు ఆందోళనలో పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ తెలంగాణ ఇంఛార్జి కార్యదర్శి బోసు రాజు తెలిపారు. ఏపీలో పీసీసీ మార్పుపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, అందరినీ కలుపుకునే సీనియర్ నాయకుడినే పీసీసీ చీఫ్‌గా అధిష్ఠానం నియమిస్తుందని ఏఐసీసీ కార్యదర్శి రుద్ర రాజు తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- సినిమా పేరు మార్చాం
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- మరోసారి నో చెప్పిన సమంత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
