
తాజా వార్తలు
ఖమ్మం: ఖమ్మం తెరాసలో గ్రూపు తగాదాలు కాక రేపుతున్నాయి. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి వైఖరికి నిరసనగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం సమావేశమైంది. ఈ భేటీకి పాలేరు నియోజకవర్గం, ఖమ్మం గ్రామీణ మండల నేతలు హాజరయ్యారు. నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో ఎమ్మెల్యే కందాళ తీరుపై తుమ్మల వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గ తెరాస కమిటీల్లో తుమ్మల వర్గానికి అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపేందర్‌రెడ్డిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారంరోజులుగా ఇరు వర్గాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తుమ్మల ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీలు వేయాలని ఆ వర్గం నిర్ణయించినా.. తాజాగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఉతికి ఆరేశారు
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
