
తాజా వార్తలు
అమరావతి : తెలుగు మాధ్యమం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా విమర్శలు కొనసాగిస్తున్నారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప.. మనకు తెలుగు భాష సరస్వతి దేనికి పనికిరాదా అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో వైకాపా ఎంపీ రఘురామ కృషరాజు మాటలు వింటుంటే ఎవరికైనా అదే అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. రఘురామకృష్ణ రాజు ప్రసంగం వీడియోను పవన్ ట్విటర్లో ఉంచారు.
ఆర్టికల్ 350ఏ ప్రకారం తెలుగు కోసం డబ్బులు తీసుకుని.. ఆంగ్లం కోసం ఖర్చుపెడతారా? అని పవన్ మరో ట్వీట్లో ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యాలయం కచ్చితంగా దీనిని గుర్తిస్తుంది అని పేర్కొన్నారు.
Tags :