close

తాజా వార్తలు

జనసేన ఆధ్వర్యంలో ‘మన నుడి-మన నది’

హైదరాబాద్‌: జనసేన ఆధ్వర్యంలో ‘మన నుడి-మన నది’ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ‘‘మన భవితకు ప్రాణధారమైన మాతృభాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతాం. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరం. మాతృభాష, నదులను పరిరక్షించుకొనే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నాగరికతకు పుట్టినిల్లు నది. నది లేనిదే సంస్కృతి లేదు. నది నశించాక ఆ సంస్కృతి మిగలదు. నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదు. మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు. మన నుడిని, నదిని కాపాడుకోవాలి. అందుకే విజ్ఞులు, మేధావులతో ఈ అంశంపై చర్చించాం. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని భాగస్వాముల్ని చేసేలా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.