close

తాజా వార్తలు

అవసరమైతే రజనీతో చేయి కలుపుతా!

కమల్‌ హాసన్‌

చెన్నై: తమిళనాడు ప్రజల కోసం కమల్‌ హాసన్‌తో చేయి కలిపేందుకు సిద్ధమని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించడంపై మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ స్పందించారు. రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడారు. అవసరమైతే ఇద్దరం కలిసే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు.

‘నా స్నేహితుడు రజనీకాంత్‌ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నా. అవసరమైతే ఇద్దరం కలిసే రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతాం. ఇద్దరం కలిసే పనిచేస్తాం. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మా ఇద్దరి ఎజెండా అయినప్పుడు మా నిర్ణయంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. ఆ అవసరం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. మాకు పని ముఖ్యం. విధివిధానాలపై తర్వాత చర్చిస్తాం. మేం గత 43 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పుడు మళ్లీ కలిసే పనిచేయడం అంత అద్భుతమైన విషయమేం కాదు. కాకపోతే అది వినోద రంగం. ఇది ప్రజా సేవా రంగం. మేం రాజకీయాలు చేయడానికి కలవడం లేదు. ప్రజల భవిష్యత్తుకోసంమే చేయికలుపుతాం’ అని కమల్‌ అన్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తారా అని ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అనిపిస్తే కమల్‌హాసన్‌, తానూ కలిసి పనిచేసేందుకు సిద్ధమని రజనీకాంత్‌ అన్నారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.