close

తాజా వార్తలు

ఎలక్టోరల్‌ బాండ్లపై కాంగ్రెస్‌ నిరసన

దిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల విధానాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు శుక్రవారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు. బాండ్ల పేరిట ప్రధాని దేశ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎలక్టోరల్‌ బాండ్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం వాటిని తోసిపుచ్చిందని వార్తలు రావడంతో ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చకు తెరలేపింది. ఈ అంశంపై లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. ఎలక్టోరల్‌ బాండ్ల పేరుతో భాజపా అవినీతిని కప్పిపుచ్చుతోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఈ విధానంలో పారదర్శకత లేదని.. ఆ బాండ్లను ఎవరు, ఏ పార్టీ కోసం కొంటున్నారో సమాచారం ఉండదని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.