
తాజా వార్తలు
గుంటూరు: వైకాపా ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మాజీ మంత్రి ఎమ్ఎస్ఎస్ కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమానికి లోకేశ్ హాజరయ్యారు. కోటేశ్వరరావు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజధాని కోసం స్పచ్ఛందంగా భూములిచ్చిన రైతుల నమ్మకాన్ని వైకాపా సర్కారు నట్టేట ముంచిందన్నారు. రాజధానిపై మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో అమరావతి రాజధానిగా ఉండేందుకు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. రాజధానిపై వైకాపా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలను ముఖ్యమంత్రి జగన్ పొమ్మంటే.. తెలంగాణ వాటిని రమ్మని పిలుస్తోందని ఎద్దేవా చేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
