
తాజా వార్తలు
శాఖాధిపతులతో సీఎం సమీక్ష
అమరావతి: సామాన్యులపై భారం మోపకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎలా పెంచుకోవచ్చో ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోవాలని, ఇందుకు దిల్లీలోని అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై కొన్ని నెలలుగా దృష్టి పెట్టామని చెప్పారు.
అనవసర వ్యయాన్ని తగ్గించడానికి అధికారులు దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా సంతృప్త స్థాయిలో చేస్తుందనేది నిర్వివాదాంశం కావాలని స్పష్టం చేశారు. నవరత్నాల అమలే అధిక ప్రాధాన్యమని జగన్ దిశానిర్దేశం చేశారు. మేనిఫెస్టో ద్వారా తమ ప్రాధాన్యతలు ఏంటో ఇప్పటికే ప్రజలకు తెలియజేశామన్నారు. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం మొదలవుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు సంబంధించిన పనులు కచ్చితంగా జరగాలని జగన్ ఆదేశించారు. ఏ పనికైనా శంకుస్థాపన చేస్తే..4 వారాల్లోగా పనులు ప్రారంభం కావాల్సిందేనని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎంగా తాను ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుత్వమిచ్చే హామీగానే పరిగణించాలని జగన్ స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనల సందర్భంగా ఇచ్చే హామీల అమలుపై దృష్టి సారించాలన్నారు.
మత్స్యకార భరోసాపై సీఎం సమీక్ష
అనంతరం వైఎస్ఆర్ మత్స్యకార భరోసాపై సీఎం సమీక్షించారు. గ్రామ సచివాలయాల్లో మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాలు అందుబాటులో ఉన్నాయని.. ఇప్పటి వరకు పథకం ద్వారా లబ్ధిపొందని వారు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అర్హులెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని.. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని సీఎం స్పష్టం చేశారు. మత్స్యకార భరోసా కింద ప్రతి శుక్రవారం కొత్త లబ్ధిదారులకు నగదు జమ అవుతుందని ఆయన తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
