close

తాజా వార్తలు

‘కాంగ్రెస్‌ది రిటైల్‌.. భాజపాది హోల్‌సేల్‌’

‘కాంగ్రెస్‌ది రిటైల్‌.. భాజపాది హోల్‌సేల్‌’

విశాఖ: వచ్చే ఎన్నికల్లో భాజపాను వ్యతిరేకించే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ది రిటైల్‌ అవినీతి అయితే.. భాజపాది హోల్‌సేల్‌ అవినీతి అని నారాయణ విమర్శించారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు హాజరయ్యారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ నేత రాజా, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వ్యూహాత్మక చర్యలపై 3 రోజుల పాటు మేథోమథనం నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధనకోసం దిల్లీలో వచ్చేనెల 3,4 తేదీల్లో ధర్నా చేపట్టనున్నట్లు సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసం సీపీఐ, సీపీఎం పార్టీలు జనసేనతో కలిశాయన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సభలు పెడతామని చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 2019 ఎన్నికలపై చర్చిస్తామని రామకృష్ణ వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.