close

తాజా వార్తలు

1051 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌

1051 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాలకు ఏపీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ చదివిన వారిని ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించింది.  ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు అభ్యర్థులు దరఖాస్తు స్వీకరించనున్నట్టు ఏపీపీఎస్సీ తెలిపింది.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న స్క్రీనింగ్ ప‌రీక్ష‌  నిర్వహించనున్నారు. ఆగస్టు 2న మెయిన్స్‌ పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. గతంలో భర్తీ చేయకుండా ఉన్న 51 ఉద్యోగాలతో పాటు తాజాగా మరో 1000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

1. శ్రీకాకుళం- 114 
2. విజ‌య‌న‌గ‌రం- 120 
3. విశాఖ‌ప‌ట్నం- 107 
4. తూర్పు గోదావ‌రి- 104 
5. ప‌శ్చిమ గోదావ‌రి- 25 
6. కృష్ణా- 22 
7. గుంటూరు- 50 
8. ప్ర‌కాశం- 172 
9. నెల్లూరు- 63 
10. చిత్తూరు- 141 
11. అనంత‌పురం- 41 
12. క‌ర్నూలు- 90 
13. క‌డ‌ప‌- 02 
 

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.