close

తాజా వార్తలు

7 నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ

7 నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఏడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 169 గ్రూప్‌-1, 446 గ్రూప్‌-2 ఉద్యోగాలతో పాటు మొత్తం 1,386 ఉద్యోగాల భర్తీకి ఇవాళ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్‌-1 పోస్టులకు జనవరి 7 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.  446 గ్రూప్‌-2 పోస్టులకు జనవరి 10 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 5న గ్రూప్‌-2 ప్రాథమిక పరీక్ష, జులై 18, 19 తేదీల్లో గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. 292 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, 154 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు,  సాధారణ పరిపాలన శాఖలో 150 ఏఎస్‌వో పోస్టులు,  సీనియర్‌ అకౌంటెంట్లు 20, ఎక్సైజ్‌ శాఖలో 50 ఎస్‌ఐ పోస్టులు,  పంచాయతీరాజ్‌శాఖలో 40 ఎక్స్‌టెన్షన్‌ అధికారులు,  డిప్యూటీ తహశీల్దార్లు 16, ఖజానాశాఖలో 13 సీనియర్‌ అకౌంటెంట్లు,  ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 405 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు లెక్చరర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.  మత్స్యశాఖలో  43 పిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 308 లెక్చరర్‌ పోస్టులకు  ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిషరీస్‌ సబ్‌ సర్వీస్‌లో 10 అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ పోస్టులకు  జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8వరకు, ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌లో 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌ పోస్టులకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.