close

తాజా వార్తలు

బదిలీలు సహజమే: సాయి కల్యాణ్‌ చక్రవర్తి

బదిలీలు సహజమే: సాయి కల్యాణ్‌ చక్రవర్తి

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రతి న్యాయమూర్తికి బదిలీలు సహజమేనని ఉమ్మడి జిల్లా కోర్టు న్యాయమూర్తి సాయికల్యాణ్‌ చక్రవర్తి అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు నిత్య విద్యార్థులుగా ఉండాలని సూచించారు. ప్రతి రోజు కొత్త విషయాలను తెలుసుకోవాలని కోరారు. అనంతరం బదిలీపై వెళ్లిన న్యాయమూర్తులను బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ప్రతిభ, న్యాయమూర్తులు శ్యాంశ్రీ, భవాని, రజని, శైలజ, సునందమ్మ, సునితారాణి, అన్నపూర్ణ, న్యాయవాదులు శ్రీనివాస్‌, కృష్ణ, ప్రసాద్‌, మహేందర్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్‌, రమాదేవి, మారుతీరావు, సీహెచ్‌ ప్రకాశ్‌, ఆంజనేయులు, మాధవి తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి అర్బన్‌: ప్రతి ఒక్కరు విధి నిర్వహణలో పదవీ విరమణ చేయడం సహజమేనని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పటాన్‌చెరులో పని చేసిన ఏఎస్‌ఐ నరేందర్‌రెడ్డిని సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో పదవీ విరమణ నేపథ్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్‌, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గారెడ్డి, కోశాధికారి ఆసీఫ్‌ అలీ పాల్గొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.