close

తాజా వార్తలు

నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని బలపర్చాలి: సీపీఐ

నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని బలపర్చాలి: సీపీఐ

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని బలపరిచి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు పి.కామేశ్వరరావు, ఒమ్మి రమణ పిలుపునిచ్చారు. ఆదివారం ఈ అంశంపై అమర్‌ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వాలు అభివృద్ధిని దెబ్బకొట్టి ప్రజలను కడగండ్ల పాలు చేశాయని విమర్శించారు. వీరు అభివృద్ధి పేరుతో పేద రైతుల నుంచి బలవంతంగా భూములు లక్కోని కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న వైకాపాకు భిన్నమైన విధానాలు లేవని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపా ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, మత సామరస్యం, అవినీతి లేని సుపరిపాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలని ఆకాంక్షించారు. సీపీఐ, సీపీఎం, జనసేన ఇంకా కలిసి వచ్చే శక్తులన్నీ కలసి ప్రత్యామ్నాయాన్ని అందించాలని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆల్తి అప్పలనాయుడు, వి.కృష్ణంరాజు, బుగత సూరిబాబు, టి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.