close

తాజా వార్తలు

మంగళగిరిని మరో గచ్చిబౌలిగా మారుస్తా!

రోడ్డు షోలో మంత్రి నారా లోకేశ్‌ 

మంగళగిరి: మంగళగిరి ప్రాంతాన్ని మరో గచ్చిబౌలిగా మారుస్తానని మంత్రి నారా లోకేశ్‌ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఐటీ మంత్రి స్థానంలో ఈ ప్రాంతానికి ఎన్నో ఐటీ సంస్థలను తీసుకొచ్చానని.. మంగళగిరి నుంచి తనను గెలిపిస్తే మరింత కృషి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని చిర్రావూరులో లోకేశ్‌ శనివారం రోడ్డు షో నిర్వహించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పనితీరును ఎండగట్టారు. ‘‘నేను మంత్రి పదవి చేపట్టి 24 నెలలు దాటింది. నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది.. పరిష్కరించాలని ఆయన ఇంతవరకూ మమ్మల్ని అడగలేదు. కనీసం ప్రజలకు అందుబాటులో కూడా లేరు. నా నివాసం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఓటు హక్కు ఇక్కడే ఉంది. మిగతా నియోజకవర్గాలు అసూయపడేలా మంగళగిరిని అభివృద్ధి చేస్తా. వైకాపా నాయకులు ఏం చూసినా అది తెదేపాకు చెందినదనే భ్రమలో ఉండిపోతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకొనేందుకు కేంద్రంపై పోరాడుతుంటే వారు అక్కసుతో ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు’’ అని లోకేశ్‌  మండిపడ్డారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.