close

తాజా వార్తలు

ఏపీలో స్మార్ట్‌ విద్యుత్తు మీటర్లు..!

న్యూదిల్లీ: దేశంలో విద్యత్తు సరఫరా నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వ రంగానికి చెందిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌(ఈఈఎస్‌ఎల్‌), ఫ్రాన్స్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ ది ఫ్రాన్స్‌ ఎస్‌ఏ(ఈడీఎఫ్‌)లు కలిసి ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లలో దాదాపు 50లక్షల స్మార్ట్‌ మీటర్లను అమర్చాలని నిర్ణయించాయి. 
ఈ కాంట్రాక్టులో ఈడీఎఫ్‌కు 95శాతం వాటా ఉండగా.. యాక్సెంచర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ఇండియాకు 5 శాతం వాటా ఉంది. ఈ కన్సార్టియం మీటర్లను అమర్చడం , వాటిని విద్యుత్తు సంస్థ బిల్లింగ్‌ వ్యవస్థకు అనుసంధానించడం చేస్తుంది. తొలుత ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లలో మొదలు పెట్టనున్నట్లు ఫ్రెంచి రాయబార కార్యాలయం వెల్లడించింది. 
స్మార్ట్‌ మీటర్ల వల్ల ఉపయోగం..
స్మార్ట్‌ మీటర్లను అమర్చడం వల్ల బిల్లింగ్‌, మీటరింగ్‌, కలెక్షన్లలో మానవజోక్యం చాలా తగ్గిపోతుంది. ఈ పద్దతి వల్ల విద్యుత్తు దొంగతనం జరిగే ప్రదేశాలను తేలిగ్గా గుర్తించవచ్చు. దీనికి ప్రత్యేకమైన కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ , కంట్రోల్‌ సెంటర్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ అవసరం. ఇవి క్షేత్రస్థాయిలో వచ్చే విద్యుత్తు, పంపిణీ చేసిన విద్యుత్తులో వినియోగించిన మొత్తాన్ని లెక్కగడతాయి. 
దేశంలోని దాదాపు 25కోట్ల సంప్రదాయ మీటర్లను స్మార్ట్‌ మీటర్లుగా మార్చేందుకు ఈఈఎస్‌ఎల్‌ నడుం బిగించింది. ఈ కార్యక్రమం పూర్తి అయితే డిస్కమ్‌ల వార్షికాదాయం రూ.1.38లక్షల కోట్లు పెరగనుంది.  ప్రస్తుతం విద్యుత్తు దొంగతనాల కారణంగా దేశంలో డిస్కమ్‌లు  కొన్ని వేల కోట్లు నష్టపోతున్నాయి. ఒక్క ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే 34లక్షల అక్రమ విద్యత్తు కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.