close

తాజా వార్తలు

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది. శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట శాసనసభ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా, ఎనిమిది సార్లు కాంగ్రెస్, అయిదు సార్లు తెదేపా, రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైకాపాకు చెందిన రెడ్డి శాంతిపై తెలుగుదేశం పార్టీకి చెందిన కె.రామ్మోహన్‌నాయుడు 1,27,094 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

శ్రీకాకుళం నుంచి గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952 బొడ్డేపల్లి రాజగోపాలరావు (స్వతంత్ర) 
* 1957 బొడ్డేపల్లి రాజగోపాలరావు (కాంగ్రెస్) 
* 1962 రాజగోపాలరావు(కాంగ్రెస్) 
* 1967 సర్దార్ గౌతులచ్చన్న(స్వతంత్ర) 
* 1971 ఎన్.జి.రంగా(స్వతంత్ర) 
* 1977 రాజగోపాలరావు (కాంగ్రెస్) 
* 1980 రాజగోపాలరావు (కాంగ్రెస్) 
* 1984 హనుమంతు అప్పయ్యదొర(తెలుగుదేశం) 
* 1991 డాక్టర్ కణితి విశ్వనాథం (కాంగ్రెస్) 
* 1996 కింజరాపు ఎర్రన్నాయుడు (తెలుగుదేశం) 
* 1999 కింజరాపు ఎర్రన్నాయుడు (తెలుగుదేశం) 
* 2004 కింజరాపు ఎర్రన్నాయుడు(తెలుగుదేశం) 
* 2009 కృపారాణి (కాంగ్రెస్)
* 2014 కె.రామ్మోహన్‌నాయుడు(తెలుగుదేశం)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.