close

తాజా వార్తలు

దహీ శాండ్‌విచ్‌

అమ్మ చేత కమ్మగా

ఈ కాలంలో పెరుగు ఎక్కువగా తీసుకుంటేనే మంచిదంటారు. అందుకే పిల్లలు ఇష్టపడే శాండ్‌విచ్‌ను పెరుగుతో ఎలా చేయొచ్చో చూద్దామా...
తయారీ: మొదట పెరుగును శుభ్రమైన, మందమైన కాటన్‌ వస్త్రంలో తీసుకుని మూటలా కట్టాలి. నీరంతా పోయి గట్టిగా అవుతుంది. అందులో   బ్రెడ్‌స్లైసులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అంచులు కత్తిరించిన ఓ బ్రెడ్‌స్లైసును తీసుకుని దానిపై పెరుగు మిశ్రమాన్ని పరిచి, మరో  స్లైసు ఉంచాలి. ఇలా మిగిలిన రెండు స్లైసులు చేసుకుంటే చాలు. దీన్ని నచ్చిన ఆకృతిలో కూడా కత్తిరించుకోవచ్చు.

కావల్సినవి: బ్రెడ్‌ స్లైసులు - నాలుగు, పెరుగు - రెండు కప్పులు, మయొనైజ్‌ (ఎగ్‌లెస్‌) - పావు కప్పు, క్యారెట్‌, క్యాప్సికం, క్యాబేజీ తరుగు - అన్నీ కలిపి పావుకప్పు, ఉడికించిన మొక్కజొన్న గింజలు - రెండు చెంచాలు,   మిరియాల పొడి - పావు చెంచా, ఉప్పు - తగినంత.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.