close

తాజా వార్తలు

ఏపీ పోలీస్‌శాఖపై కీలక జీవో విడుదల

అమరావతి: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్‌ 721ను విడుదల చేసింది. 
దీనిలో భాగంగా పోలీస్‌శాఖలో డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకూ సీఈసీ పరిధిలోకి తెచ్చింది. మే 27వరకు ఈ ఉత్తర్వుల అమలులో ఉండనున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకూ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే పోలీసు యంత్రాంగం పనిచేయనుంది. సీఈసీ తాజా ఆదేశాలతో రాష్ట్ర  ప్రభుత్వ జీవోకు ప్రాధాన్యత సంతరించుకుంది.

జీవో ప్రతి కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.