
తాజా వార్తలు
అమేఠీ: కేంద్ర మంత్రి, భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ గురువారం ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేఠీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు స్మృతి తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే స్మృతి నామినేషన్ వేశారు. వాస్తవంగా ఆమె ఏప్రిల్ 17న నామినేషన్ వేయాలని భావించగా, ఆ రోజు సెలవు దినం కావడంతో ఏప్రిల్ 11కు మార్చుకున్నారని భాజపా నాయకులు వెల్లడించారు.
గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి ఆ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ మీద 2014లో కూడా స్మృతి ఇరానీ పోటీ పడ్డారు. కానీ విజయం మాత్రం రాహుల్‌నే వరించింది. గత ఐదు సంవత్సరాల కాలంలో ఆమె అనేకమార్లు ఆ నియోజకవర్గాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు. అయితే ఈ ఇరువురి నేతల్లో ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
