close

తాజా వార్తలు

రాహుల్‌ గాంధీ బ్రిటన్‌ పౌరుడా..?

అభ్యంతరాలు వ్యక్తం చేసిన అమేఠీ స్వతంత్ర అభ్యర్థి

అమేఠీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేఠీ నుంచి మరోసారి పోటీకి దిగారు. ఇటీవలే ఇందుకోసం నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే రాహుల్‌ నామపత్రాల పరిశీలనను అమేఠీ రిటర్నింగ్‌ అధికారి రామ్‌ మనోహర్‌ మిశ్రా ఏప్రిల్‌ 22కు వాయిదా వేశారు. రాహుల్‌ నామినేషన్‌లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయంటూ అమేఠీ స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్‌ లాల్‌ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నామ పత్రాల పరిశీలనను వాయిదా వేసినట్లు మిశ్రా వెల్లడించారు. 

ఈ సందర్భంగా ధ్రువ్‌ లాల్‌ న్యాయవాది రవి ప్రకాశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్‌ నామినేషన్‌లో ముఖ్యంగా మూడు అంశాలను మేం ప్రస్తావించాం. మొదటిది.. రాహుల్‌కు చెందిన ఓ యూకే కంపెనీ రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో ఆయన బ్రిటన్‌ పౌరుడిగా రాసి ఉంది. ఆయనకు యూకే పౌరసత్వం ఎలా వచ్చింది. ఆ తర్వాత భారత పౌరుడు ఎలా అయ్యారు? ఇక రెండోది రాహుల్‌ ఎన్నికల అఫిడవిట్‌లో 2003 నుంచి 2009 మధ్య యూకే కంపెనీకి చెందిన ఆస్తులను వెల్లడించలేదు. ఇక ఆయన విద్యార్హతలపై కూడా అనేక అనుమానాలున్నాయి. రాహుల్‌ సమర్పించిన విద్యా పత్రాల్లో ఆయన పేరు రౌల్‌ విన్సీ అని రాసి ఉంది. రాహుల్‌ గాంధీ.. రౌల్‌ విన్సీ ఒకరేనా..? అలా కాకపోతే ఆయన ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

ఈ విషయాల్లో స్పష్టత వచ్చేంత వరకు ఆయన నామినేషన్‌ను స్వీకరించవద్దని రిటర్నింగ్‌ అధికారిని కోరినట్లు రవిప్రకాశ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేఠీలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో రాహుల్‌ ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. అమేఠీలో రాహుల్‌ ప్రధాన ప్రత్యర్థిగా భాజపా నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.