close

తాజా వార్తలు

ప్రపంచమంతా ఏకం కావాలి: దేవెగౌడ

బెంగళూరు: ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాలని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ‘ ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేయడానికి ప్రపంచమంతా ఏకం కావటానికి ఇదే సరైన సమయం. ఆదివారం శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను ’ అని సోమవారం దేవెగౌడ తెలిపారు. పవిత్ర ఈస్టర్‌ పర్వదినమైన ఆదివారం శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా చేసుకొని జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 290 మంది మరణించారు. 500 మందికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ బాంబు పేలుళ్లలో నలుగురు జనతా దళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌)కు చెందిన నేతలు మరణించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఈ పేలుళ్లలో జేడీఎస్‌ నేతల్లో లక్ష్మణ గౌడ రమేశ్‌, కేఏం లక్ష్మీనారాయణ్‌, ఎం. రంగప్ప, కేజీ హనుమంతరాయప్ప మృతి చెందగా.. మరో ముగ్గురు హెచ్‌. శివు కుమార్‌, ఎ. మారెగౌడ, హెచ్‌ పుట్టరాజు ఆచూకీ ఇంకా తెలియ రాలేదని కుమార స్వామి తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు భారతీయులు మరణించినట్లు సమాచారం. ఈ పేలుళ్లతో సంబంధమున్న 24 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.   


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.