close

తాజా వార్తలు

ఫలితాలు చూసి నివ్వెరపోయిన విద్యార్థిని

నల్గొండ టౌన్‌: నల్గొండ పట్టణం బీటీఎస్‌కు చెందిన ఎండీ.నౌషిన్‌ హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 2018లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. అయితే, యూనాని మెడిసిన్‌ కోసం ఈ ఏడాది మార్చిలో అరబిక్‌ పేపర్‌ - 1, 2 పరీక్షలు (ఎక్స్‌టర్నల్‌ లాంగ్వేజ్‌) రాశారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఆమె రాసిన పరీక్షల పేపర్లు కాకుండా ఉర్దూ పేపర్‌-1, 2 రాసినట్లు.. వాటిలోనూ సున్నా మార్కులు వచ్చినట్లు ఇంటర్నెట్‌లో జాబితా వచ్చింది. దీంతో నౌషిన్‌ నివ్వెరపోయారు. తాను రాసిన అరబిక్‌ పేపర్‌- 1, 2లలో కనీసం 90 మార్కులు వస్తాయని.. ఈ సబ్జెక్టుల్లో అర్హత సాధిస్తేనే యూనాని మెడిసిన్‌ చేసే అవకాశం ఉంటుందని ఆమె ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ప్రస్తుతం రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజులుగా ఇంటర్‌ బోర్డు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని వాపోయారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.