Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 89544
            [news_title_telugu_html] => 

ఇంటర్‌ బోర్డు ఎదుట సీపీఎం ధర్నా

[news_title_telugu] => ఇంటర్‌ బోర్డు ఎదుట సీపీఎం ధర్నా [news_title_english] => CPM dharna before inter board [news_short_description] => తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై గందరగోళం నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కార్యాలయాన్ని ముట్టడించేందుకు సీపీఎం నేతలు [news_tags_keywords] => TS inter results,cpm,hyderabad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/_ZRQ1dTYwjQ [news_videoinfo] => |https://www.youtube.com/embed/_ZRQ1dTYwjQ [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-26 12:34:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఇంటర్‌ బోర్డు ఎదుట సీపీఎం ధర్నా - CPM dharna before inter board - EENADU
close

తాజా వార్తలు

ఇంటర్‌ బోర్డు ఎదుట సీపీఎం ధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై గందరగోళం నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కార్యాలయాన్ని ముట్టడించేందుకు సీపీఎం నేతలు ప్రయత్నించారు. ఇంటర్‌ బోర్డు అవకతవకలను నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు అక్కడ ధర్నా నిర్వహించారు. నిరసనకు దిగిన వామపక్ష కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వారిని తరలించారు. ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్‌ చేపట్టిన చర్యలు కంటి తుడుపుగా ఉన్నాయని సీపీఎం నేతలు ఆరోపించారు.
 ఇందిరాపార్క్ వద్ద ధర్నా

ఇంటర్‌ ఫలితాలపై ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌, ధర్నాచౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. భారీ సంఖ్యలో ఎన్‌ఎస్‌యూఐ శ్రేణులు అక్కడికి చేరుకొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు గన్‌పార్క్‌ వద్ద బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.