close

తాజా వార్తలు

ఆ విషయం మాత్రం ప్రియాంక చెప్పట్లేదు: ఇరానీ

అమేఠీ (ఉత్తర్‌ప్రదేశ్‌): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి, భాజపా అమేఠీ అభ్యర్థి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటున్న ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను అమేఠీకి ఎన్నిసార్లు వచ్చానన్న విషయాన్ని ప్రియాంకా గాంధీ లెక్కపెడుతున్నారు.. ఈ విషయంపై నేను హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 15 ఏళ్లుగా అమేఠీకి రాకుండా రాహుల్‌ ఎక్కడ ఉన్నారన్న విషయంపై మాత్రం ఆమె ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ విషయంపై వివరాలు ఇవ్వాలని ఆమెను కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.

‘ఈ ప్రాంతంలో నెలకొల్పాల్సి ఉన్న ఫుడ్‌ పార్క్‌పై రాహుల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఇక్కడ మెగా ఫుడ్‌ పార్క్‌ నెలకొల్పేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఈ ఫుడ్‌ పార్క్‌ కోసం గ్యాస్‌ను సరఫరా చేయొద్దని మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వమే లిఖిత పూర్వకంగా ఆదేశించింది. అప్పట్లో ఆ లేఖను అందరికీ చూపారు. ఇప్పుడు ఇదే విషయంపై ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది’ అని స్మృతి ఇరానీ విమర్శించారు. కాగా, అమేఠీలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.