close

తాజా వార్తలు

రాహుల్‌ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

చండీగఢ్‌: అమేఠీ నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓడిపోతే తాను రాజకీయాలను వదిలేస్తానని ఆ పార్టీ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అన్నారు. ఆదివారం ఓ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. 

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ అమేఠీ నుంచి ఓడిపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సిద్ధూ అన్నారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. విశ్వాసంతో పనిచేసేవారే జాతీయవాదులు అవుతారని దుయ్యబట్టారు. జాతీయవాదం అంటే ఏమిటో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నుంచి నేర్చుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓటమికి రఫేల్‌ వివాదం ప్రధాన కారణం అవుతుందని విమర్శించారు. 

యూపీలోని కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేఠీ నుంచి రాహుల్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి అమేఠీతో పాటు కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా రాహుల్‌ బరిలోకి దిగారు. ఇక అమేఠీలో గత ఎన్నికల్లో రాహుల్‌ చేతిలో ఓటమిపాలైన భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ సారి రాహుల్‌, స్మృతి మధ్య గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.