
తాజా వార్తలు
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా
అమేఠి: కుటుంబ సభ్యులంతా తమ పిల్లలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి దూరంగా ఉంచుకోవాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. కొద్ది రోజుల క్రితం కొంత మంది పిల్లలు ప్రియాంక గాంధీ ముందు నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రియాంక పిల్లలను తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ప్రధానమంత్రిని తిట్టాలని పిల్లలకు చెప్పి నినాదాలు చేయించారు. రాజకీయ ప్రచారాల కోసం చిన్న పిల్లలను ఎలా వాడుకుంటారు? దీనివల్ల వాళ్లేం నేర్చుకుంటారు. అందుకే పిల్లలను ఆమెకు దూరంగా ఉంచాలని నేను అన్ని కుటుంబాల వారిని కోరుతున్నా.’’ అని ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు.
గతంలో రాయ్‌బరేలీలో ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌పై ప్రియాంక నిప్పులు చెరిగారు. ప్రధాని తన నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదని, అక్కడి రైతుల సమస్యలేంటో కూడా తెలుసుకోలేదని ధ్వజమెత్తారు. దీనిపై స్మృతి స్పందిస్తూ.. ‘‘ఇదే ఆమె అసలు స్వభావం. సాక్షాత్తూ ప్రధానిపై కనీస మర్యాద లేకుండా మాట్లాడారు. చివరికి యూపీ ముఖ్యమంత్రి, గోరఖ్‌నాథ్ మఠం అధ్యక్షుడిని కూడా విలువ లేకుండా మాట్లాడారు.’’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తరపున ఎక్కడా పోటీ చేయకుండా ఉన్న ప్రియాంక, సోదరుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారంటే.. రాహుల్ అసమర్థత అక్కడే తేలిపోతోందని విమర్శించారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
