close

తాజా వార్తలు

అమేఠీ ప్రజలకు రాహుల్ భావోద్వేగపు లేఖ


అమేఠీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన అమేఠీ వాసులకు భావోద్వేగపూరిత లేఖ రాశారు. మే 6న జరిగే ఎన్నికల్లో మరోసారి ఓటు వేసి తనను గెలిపించాలని దానిలో కోరారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే భాజపా నిలిపివేసిన పథకాలన్నింటిని మళ్లీ అమలు చేస్తామని వెల్లడించారు. 
నా అమేఠీ కుటుంబసభ్యులారా అంటూ ఆ లేఖను ప్రారంభించిన రాహుల్..‘కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే భాజపా ప్రభుత్వం నిలిపివేసిన పథకాలన్నింటిని మళ్లీ అమలు చేస్తానని అమేఠీ ప్రజలకు హామీ ఇస్తున్నా. నన్ను మళ్లీ మీ కుటుంబంలో చేర్చుకునేందుకు మే 6న పెద్ద సంఖ్యలో ఓటు వేయండి’ అని ప్రజలను కోరారు. ‘నిజాయతీ, సమగ్రత, నిరాడంబరత’ అమేఠీ ప్రజల బలమని దానిలో పేర్కొన్నారు. సమన్యాయం, సత్యం వైపు నిలబడే ధైర్యాన్ని తనకు ఈ ప్రాంత ప్రజలు అందించారన్నారు. భాజపా అబద్ధాలు చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుందని విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశంలో రెండు సిద్ధాంతాలున్నాయని.. రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల వైపు కాంగ్రెస్‌ ఉండగా, భాజపా మాత్రం 20 మంది వ్యాపారవేత్తల కోసం పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమేఠీ కాంగ్రెస్‌ కంచుకోట. ఇక్కడ రాహుల్‌కు పోటీగా భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ పడుతున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.