
తాజా వార్తలు
అమేఠీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో విస్తృత పర్యటనలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అధికార పార్టీ భాజపాపై విరుచుకుపడుతున్నారు. తాజాగా శనివారం అమేఠీలో పర్యటించిన ఆమె.. రైతులు, నిరుద్యోగుల సమస్యల్ని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమకు తాము కాపలాదారులం అని చెప్పుకుంటున్న భాజపా నాయకులు.. రైతుల పొలాల్లో కాపలా ఉండగలరా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రైతులు, విద్యార్థులు, మహిళలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంటే ప్రధాని మోదీ మాత్రం తన సమయాన్ని విదేశీ పర్యటనలతోనే గడిపేస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ వెళ్లి బిర్యానీ తినేంత సమయం ఉన్న మోదీకి.. రైతుల సమస్యల పరిష్కారంపై ఆలోచించే సమయమే లేదని ఘాటుగా విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి రూ.15లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాల వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు.
ఈ సందర్భంగా అమేఠీ భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపైనా ప్రియాంక విమర్శలు గుప్పించారు. ఐదేళ్లలో స్మృతి ఇరానీ కేవలం 16 సార్లే నియోజకవర్గంలో పర్యటించారని..అందులోనూ మీడియా కవరేజీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మాత్రం అనేక సార్లు ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం వచ్చారన్నారు. వారితో మమేకమయ్యారన్నారు. ఓవైపు కాంగ్రెస్ గ్రామ ప్రధాన్లకు మేనిఫెస్టోలు పంపుతుంటే.. భాజపా మాత్రం సీల్డ్ కవర్లలో రూ.20వేలు పంచుతోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని భాజపా అపహాస్యం చేస్తోందన్నారు. ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తవగా.. మరో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
