close

తాజా వార్తలు

ఈ కారును నడపలేననుకున్నారు: కత్రినా

ముంబయి: తాను కథానాయికగా నటించిన ‘భారత్’ చిత్రం నుంచి ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌. క్లాసిక్‌ 1960 ల్యాండ్‌రోవర్‌ వాహనాన్ని కత్రినా నడుపుతున్నప్పుడు తీసిన ఫొటో అది. అయితే ఈ ఫొటోను కత్రినా ఎందుకు పోస్ట్‌ చేశారంటే.. ‘భారత్‌’ చిత్రంలో ఆమె ఈ వాహనాన్ని నడిపే సన్నివేశం ఒకటి ఉంది. మరో విషయం ఏంటంటే.. ఆ కారు అసలు యజమాని కూడా కత్రినా పక్కనే కూర్చని ఉంటారు. 
అయితే కత్రినా ఈ కారు ఎక్కగానే ‘దీనిని నడపడం ఆమె వల్ల కాదులే..’ అనుకున్నారట. ఈ విషయాన్ని కత్రినాతో చెప్పారట. 
దీని గురించి కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ.. ‘నా పక్కన కూర్చున్న వ్యక్తి ఈ కారు అసలు యజమాని. నేను దీనిని నడపలేనని అనుకున్నాడట. కానీ నేను నడిపి చూపించగలను అని నిరూపించాను’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోకు ఐదు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ‘శెభాష్ కత్రినా’ అంటూ నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 
సల్మాన్‌, కత్రినా జంటగా నటించిన ‘భారత్’ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. దిశా పటానీ మరో కథానాయికగా నటించారు. రంజాన్‌కు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కత్రినా రేంజ్‌ రోవర్‌ ఎస్‌ఈ వోగ్‌ ఎస్‌యూవీని కొనుక్కున్నారు. దీని విలువ దాదాపు రూ.2.72 కోట్లు.   


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.