close

తాజా వార్తలు

మామిడి శ్రీఖండ్‌

అమ్మ చేత కమ్మగా

ఎంతసేపూ ఐస్‌క్రీం కావాలని పేచీ పెట్టే పిల్లలకు ఈసారి మామిడి శ్రీఖండ్‌ చేసి పెట్టి చూడండి.
కావల్సినవి: పెరుగు - రెండు కప్పులు, చక్కెర - పావుకప్పు, యాలకుల పొడి - పావుచెంచా, మామిడిపండు గుజ్జు - అరకప్పు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు - కొన్ని.
తయారీ: పెరుగును ఓ వస్త్రంలో తీసుకుని మూటలా కట్టి సింకులోని కుళాయికి వేలాడదీయాలి. అరగంటకు నీరంతా పోతుంది. అప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి. నాలుగు గంటలకు గట్టి పెరుగు తయారవుతుంది. దాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని చక్కెర కలపాలి. చక్కెర పూర్తిగా కరిగాక మిగిలిన పదార్థాలు  వేసుకుని అన్నింటినీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. మూడు గంటల తరువాత ఇవతలకు తీస్తే మామిడి శ్రీఖండ్‌ తినడానికి సిద్ధమైనట్లే.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.