Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 101453
            [news_title_telugu_html] => 

ఏపీ ఆర్టీసీలో సమ్మె తప్పదా?

[news_title_telugu] => ఏపీ ఆర్టీసీలో సమ్మె తప్పదా? [news_title_english] => APSRTC Unions May Go to Strike [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీలో సమ్మె నివారణకు యాజమాన్యం చేపట్టిన ప్రయత్నాలు సఫలం కాలేదు. మంగళవారం కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. [news_tags_keywords] => Apsrtc,Strike call,Unions strike [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-22 01:30:24 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఏపీ ఆర్టీసీలో సమ్మె తప్పదా? - APSRTC Unions May Go to Strike - EENADU
close

తాజా వార్తలు

ఏపీ ఆర్టీసీలో సమ్మె తప్పదా?

కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు విఫలం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీలో సమ్మె తప్పేలా లేదు. సమ్మెను నివారించేందుకు మంగళవారం కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె తేదీని రేపు ప్రకటిస్తామని కార్మిక సంఘాల ఐకాస నేతలు స్పష్టంచేశారు. వేతన సవరణ బకాయిలను గత ఉగాది నాటికి చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇంకా నెరవేర్చలేదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు ఎన్‌ఎంయూ ఈ నెల 8న సమ్మె నోటీసు ఇవ్వగా.. ఈయూ సహా 10 కార్మిక సంఘాలు 9న యాజమాన్యానికి నోటీసు ఇచ్చాయి. వెంటనే సమస్య పరిష్కరించని పక్షంలో ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా సరే సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టంచేశాయి. ఆ గడువు సమీపిస్తున్న తరుణంలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు సమ్మె నోటీసు ఇచ్చిన గుర్తింపు కార్మిక సంఘం ఈయూ సహా కార్మిక సంఘాల ఐకాసను మంగళవారం చర్చలకు ఆహ్వానించారు. దీంతో ఈ రోజు సాయంత్రం 4గంటల నుంచి ఆర్టీసీ హౌస్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. 

వేతన సవరణ బకాయిల తొలి విడత నిధుల్ని వెంటనే చెల్లించాలంటూ కార్మిక సంఘాలు తమ ప్రధాన డిమాండ్‌గా యాజమాన్యం ముందు ఉంచాయి. అద్దె బస్సుల పెంపును ఉపసంహరించుకోవాలని, సిబ్బంది కుదింపు చర్యలను వెంటనే విరమించుకోవాలని కోరాయి. మొత్తం తమ 27 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను కార్మిక సంఘాలు కోరాయి. ఆర్థిక ఇబ్బందులు కారణంగా డిమాండ్లను వెంటనే పరిష్కరించలేమని ఆర్టీసీ ఎండీ వారికి స్పష్టంచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిధులు వస్తే చెల్లిస్తామని.. అంతవరకు సమ్మెను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. కార్మిక సంఘాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఇప్పటికే బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగినందున కార్మికుల నుంచి తమకు ఒత్తిడి వస్తోందని, ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా చర్యలు తీసుకోవాలని కోరాయి. కార్మిక సంఘాలు పట్టు వీడకపోవడంతో ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో తాము సమ్మెకు వెళ్తున్నట్టు రేపు ప్రకటిస్తామని నేతలు స్పష్టంచేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు తామంతా సమావేశమై సమ్మె తేదీని ప్రకటిస్తామని ఐకాస నేత దామోదర్‌ తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.