Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102712
            [news_title_telugu_html] => 

‘నోటా’ పోటీలో నిలిచింది.!

[news_title_telugu] => ‘నోటా’ పోటీలో నిలిచింది.! [news_title_english] => nota votes in krishna district [news_short_description] => సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన చాలా మంది అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. బరిలో ఉన్న ఆయా పార్టీల్లో కొందరు అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. ఇంకొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. [news_tags_keywords] => nota,krishna,ap elections 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 09:39:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘నోటా’ పోటీలో నిలిచింది.! - nota votes in krishna district - EENADU
close

తాజా వార్తలు

‘నోటా’ పోటీలో నిలిచింది.!

వ్యతిరేకత ఓటర్లు ‘నొక్కి’ చెప్పారు
ఈనాడు డిజిటల్‌, విజయవాడ

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన చాలా మంది అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. బరిలో ఉన్న ఆయా పార్టీల్లో కొందరు అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. ఇంకొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పోటీలో ఉన్న ఎవరూ మంచివారు కాదని భావిస్తే.. ‘నన్‌ ఆఫ్‌ ది అబవ్‌- నోటా’కు ఓటు వేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. నోటాకు ఈ ఎన్నికల్లో కొన్నిచోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు రావడం విశేషం. కృష్ణా జిల్లా పరిధిలోని 16 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో నోటాకి దక్కినవి సగటున 1.1 శాతం ఓట్లు రావడం విశేషం. తిరువూరు అసెంబ్లీ స్థానంలో 12 మంది బరిలో నిలిచారు. వీరిలో వైకాపా కె.రక్షణనిధికి 88,739, రెండోస్థానంలో తెదేపా అభ్యర్థి కె.జవహార్‌కు 78,092 ఓట్లు పడ్డాయి. ఇక్కడ 1,746 ఓట్లు నోటాకు నమోదయ్యాయి. నోటా 4వ స్థానంలో నిలిచింది. నూజివీడు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు 1,01,333 ఓట్లు రాగా.. తెదేపా అభ్యర్థి ఎం.వెంకటేశ్వర్లుకి 85,301 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 2,236 ఓట్లు వచ్చి  నాలుగోస్థానంలో నిలిచింది. గన్నవరం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌ 823 ఓట్ల ఆధిక్యం సాధించగా.. నోటాకు అతనికి వచ్చిన ఆధిక్యం కంటే ఎక్కువగా 1665 ఓట్లు పడ్డాయి. గుడివాడ నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీపడగా 3108 ఓట్లతో మూడోస్థానంలో వచ్చింది. కైకలూరులో 14 మంది అభ్యర్థులు.. 1529 ఓట్లతో 5వ స్థానం, పెడనలో 9 మంది అభ్యర్థులు.. 1407ఓట్లతో 4వ స్థానం, మచిలీపట్నంలో 8 మంది అభ్యర్థులు.. 1258 ఓట్లతో 4వ స్థానం, అవనిగడ్డలో 12 మంది అభ్యర్థులు 1779 ఓట్లుతో 6వ స్థానం, పామర్రులో 12 మంది.. 1934ఓట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. పెనమలూరులో 0.72 ఓట్ల శాతం సాధించి.. నాలుగో స్థానంలో నిలవగా అక్కడ 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు పోటీపడగా.. నోటాకు 769 ఓట్లు వచ్చాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు పోటీపడగా.. 944 ఓట్లు సాధించి ఆరోస్థానంలో నిలిచింది. మైలవరం నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు పోటీ పడగా.. నోటాకు ఆరోస్థానం, నందిగామలో 9 మంది అభ్యర్థులు పోటీపడగా.. 5వ స్థానం, జగ్గయ్యపేటలో 10 మంది అభ్యర్థులు పోటీపడగా.. 5వ స్థానంలో నిలిచింది.

* విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి 15 మంది పోటీ పడగా.. 8,749 ఓట్లు సాధించి ఆరోస్థానంలో నిలిచింది. మచిలీపట్నం స్థానానికి 12 మంది పోటీపడగా.. నోటాకు 6వ స్థానం దక్కింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.