Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102790
            [news_title_telugu_html] => 

విశాఖ ఉత్తర ఫలితంపై వీడిన ఉత్కంఠ

[news_title_telugu] => విశాఖ ఉత్తర ఫలితంపై వీడిన ఉత్కంఠ [news_title_english] => ganta wins in vizag north [news_short_description] => విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ వీడింది. తెదేపా అభ్యర్థి, మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/IRRlKd6Q-bM [news_videoinfo] => |https://www.youtube.com/embed/IRRlKd6Q-bM [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 14:26:41 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విశాఖ ఉత్తర ఫలితంపై వీడిన ఉత్కంఠ - ganta wins in vizag north - EENADU
close

తాజా వార్తలు

విశాఖ ఉత్తర ఫలితంపై వీడిన ఉత్కంఠ

గంటా విజయం సాధించినట్లు ప్రకటించిన అధికారులు

విశాఖ: విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ వీడింది. తెదేపా అభ్యర్థి, మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్‌బూత్‌కి సంబంధించిన వీవీప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్లు చూపిస్తుండటంతో వైకాపా అభ్యర్థి కేకే రాజు, ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికారులు ఫలితాన్ని పెండింగులో పెట్టడంతో పాటు నియోజకవర్గ చివరి రౌండ్‌ వివరాలను వెల్లడించలేదు. తాజాగా గంటా విజయం సాధించినట్లు ప్రకటించారు.

అసలేం జరిగిందంటే..
ఏయూ ప్రాంగణంలో గురువారం రాత్రి ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఈ సమయానికి గంటా రెండువేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ కేంద్రంలో తొలుత కొన్ని ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ కారణంగా రౌండ్ల లెక్కింపునకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలను మరమ్మతులు చేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వాటిని పక్కనపెట్టి తర్వాతి రౌండ్ల లెక్కింపును కొనసాగించారు. ఇలా సుమారు ఆరు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తేలింది. మొత్తం రౌండ్లు పూర్తయ్యాక, మొరాయించిన ఈవీఎంల స్థానంలో వీవీప్యాట్లను లెక్కించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్‌బూత్‌కి సంబంధించిన వీవీప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్లు చూపిస్తుండటంతో వైకాపా అభ్యర్థి కేకే రాజు, ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికారులు ఫలితాన్ని పెండింగులో పెట్టడంతో పాటు నియోజకవర్గ చివరి రౌండ్‌ వివరాలను వెల్లడించలేదు. అయితే ఆ వీవీప్యాట్లకు సంబంధించిన ఓట్లను కేకే రాజుకు కలిపినా కూడా.. గంటా శ్రీనివాసరావుకే ఆధిక్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఈసీని సంప్రదించి గంటా విజయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.