close

తాజా వార్తలు

డబ్బు ఆశించకుండా పవన్‌పై ప్రేమతో ఓటేశారు!

జగన్‌కు నాగబాబు అభినందనలు

హైదరాబాద్: ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని సినీనటుడు, జనసేన నేత నాగబాబు అభినందించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. తమ సహకారం జగన్‌కు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. జనసైనికులనుద్దుశించి ఆయన ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. నవరత్నాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ఐదేళ్లలో జగన్‌ నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకునేలా తాము కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. జనసేన గెలుపుకోసం పనిచేసిన జనసైనికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. క్లీన్‌ పాలిటిక్స్‌తో రాజకీయాల్లోకి వచ్చామని.. తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో డబ్బులు పంచకుండా ముందుకు రాగలిగామని చెప్పారు. జనసేనకు కొన్ని లక్షల ఓట్లు వచ్చాయని.. లక్షలాది మంది ప్రజలు క్లీన్‌ పాలిటిక్స్‌ పట్ల ఇష్టంతో ఉన్నారని చెప్పారు. మార్పు కోరే ప్రజలందరికీ జనసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. డబ్బుల కోసం ఆశించకుండా కేవలం పవన్‌పై అభిమానం, ప్రేమతో, మంచి మార్పు తెస్తారన్న నమ్మకంతో ప్రజలు ఓటేశారని అన్నారు. జనసేన ఎన్నికల్లో ఓడిపోయినా.. నైతికంగా మాత్రం విజయం సాధించిందన్నారు. కచ్చితంగా మంచి మార్పు తీసుకొద్దామని జనసైనికులను ఉద్దేశించి నాగబాబు అన్నారు. గెలుపుకోసం ఎంతో అంకితభావంతో పనిచేసిన జనసైనికులంతా పార్టీ ఓటమితో భావోద్వేగాలకు గురయ్యారని.. ఎవరూ అధైర్యపడకుండా ముందుకెళ్లాలని సూచించారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.