
తాజా వార్తలు
అమేఠీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేఠీ ఎంపీ స్మృతి ఇరానీ అనుచరుడు, భాజపా నేత సురేంద్ర సింగ్ హత్యకు గురయిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి సురేంద్ర నిద్రిస్తుండగా కొందరు దుండగులు ఆయనను తుపాకీతో కాల్చారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని లఖ్‌నవూలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్మృతి ఆదివారం ఉదయం సురేంద్ర ఇంటికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. అనంతరం ఆయన అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పాడె మోశారు. అయితే అమేఠీలో స్మృతి విజయాన్ని ఓర్చుకోలేక స్థానిక కాంగ్రెస్ నేతలే ఆయనని చంపారని మృతుడి కుమారుడు అభయ్, ఇతర భాజపా నేతలు ఆరోపించారు.
ఇది రాజకీయ హత్య అయి ఉండదని అమేఠీ ఎస్పీ రాజేశ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత కక్షల నేపథ్యంలో కూడా హత్య జరిగి ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని, వాటి ద్వారా కేసును విచారిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఘటనతో సంబంధమున్నట్లు భావిస్తున్న 7 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరో 12 గంటల్లో ఈ కేసు కొలిక్కి వస్తుందన్నారు.
బారాలియా గ్రామ సర్పంచిగా పనిచేసిన సురేంద్ర..స్మృతితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సర్పంచి పదవికి రాజీనామా చేశారు. అమేఠీలో స్మృతిని గెలిపించడానికి ఈయన ఎంతో కృషి చేశారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
