close

తాజా వార్తలు

తెరాసలో అంతర్మథనం ప్రారంభమైంది: లక్ష్మణ్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. భాజపాకు చెందిన నలుగురు అభ్యర్థులు గెలవడమే కాకుండా దాదాపు 20 శాతం ఓట్లు వచ్చాయన్నారు. మరో రెండు, మూడు సీట్లు గెలిచే అవకాశమున్నప్పటికీ కొద్దిలో తప్పాయని చెప్పారు. మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి సీట్లు దక్కించు అవకాశం ఉన్నప్పటికీ అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం తదితర కారణాలతో కోల్పోయామన్నారు. దిల్లీలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తాము ఊహించిన దానికంటే ప్రజలు ఆదరించారన్నారు. భాజపాలో చేరతామంటూ పలువురు తెరాస, తెదేపా, కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే తమను సంప్రదిస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే తెరాసలో అంతర్మథనం ప్రారంభమైందని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. 

అలాంటి వాళ్లందరికీ స్వాగతం పలుకుతున్నాం

మోదీ నాయకత్వాన్ని బలపరిచేవాళ్లు, తెలంగాణ పాలనలో మార్పు కోరుకునేవాళ్లు, కుటుంబ పాలనకు స్వస్తి పలకాలనుకునేవాళ్లందరికీ భాజపాలోకి స్వాగతం పలుకుతున్నామని లక్ష్మణ్‌ అన్నారు. భాజపా కార్యకర్తలెవరూ అభద్రతా భావంతో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. బెంగాల్‌ తరహా పోరాటాలకు వెనుకంజవేయబోమని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తప్పనిసరిగా తెలంగాణలోనూ పాగా వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భాజపాతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని.. మహిళలకు పెద్దపీట వేసే పార్టీ తమదని చెప్పారు. 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.