close

తాజా వార్తలు

ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకు సూచిక!

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకూ అందేలా చూడాలని సూచించారు. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకు కొలమానమని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిబద్ధత, పారదర్శకంగా అందేలా చూడాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని అభిలషించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.