close

తాజా వార్తలు

రాజ్‌భవన్‌ వద్ద అరుదైన సన్నివేశం

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ వద్ద శనివారం సాయంత్రం ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. రంజాన్‌ మాసం సందర్భంగా ఈ సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విందులో పాల్గొనేందుకు గవర్నర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ రాజ్‌భవన్‌ నుంచి సంస్కృతి భవనం వద్దకు వెళ్తుండగా రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఆ సమయంలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్‌ చిక్కుకుంది. దీన్ని గమనించిన గవర్నర్‌ తన వాహనాన్ని నిలిపివేసి ముందుగా అంబులెన్స్‌ను పంపారు. అంబులెన్స్‌ వెళ్లాక సంస్కృతి భవన్‌కు గవర్నర్‌తో పాటు ఇద్దరు ముఖ్యమంత్రుల వాహనాలు బయల్దేరాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.