close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

1. నేడే భారత్‌, పాక్‌ మహా సమరం

క్రికెట్‌ ప్రపంచం ఒక్కసారిగా అ‘టెన్షన్‌’ అయిపోయింది.. అభిమానుల దృష్టి అంతా ఆ మ్యాచ్‌ మీదే! ఈ కొన్ని గంటలు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అన్న ఆత్రుత పెరిగిపోతోంది. కారణం ప్రపంచకప్‌కే తలమానికమైన సమరం. భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ యుద్ధం. ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పోరు ఆదివారమే. మెగా టోర్నీలో దశాబ్దాలుగా చిరకాల ప్రత్యర్థి పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్‌.. ఈసారి ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పుర చట్టం.. ప్రజల చుట్టం 

పురపాలక పౌరసేవలకు ఇక చట్టబద్ధత రానుంది. కొత్తగా రానున్న ఏకీకృత పురపాలక చట్టంలో ఆ శాఖ బాధ్యతలు.. విధులుగా మారనున్నాయి. పుర, నగర పాలక వ్యవస్థలలో ఇప్పటివరకూ అమలవుతున్న పౌరసేవాపత్రం(సిటిజన్‌ చార్టర్‌) కొత్త చట్టంలో భాగం కానుంది. ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తాయి. బాధ్యతతో కూడిన జవాబుదారీ పాలన అందించేందుకు పెద్దపీట వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించిన నేపథ్యంలో.. చట్టం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. బలముంది.. గళమెత్తండి

రాష్ట్ర సమస్యలపై మన గళం బలంగా వినిపించాలని వైకాపా ఎంపీలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైకాపా ఉన్నందున ప్రత్యేక హోదాయే లక్ష్యంగా ఉభయసభల్లోనూ ఎప్పటికప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వైకాపా ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. తెలంగాణ అంతటా ఖైదీల ఉత్పత్తులు

ఖైదీలు రూపొందించిన ఉత్పత్తులను విక్రయించేందుకు ‘మై నేషన్‌’ పేరిట రాష్ట్రంలోని అన్ని జిల్లా కారాగారాల దగ్గర జైళ్ల శాఖ విక్రయశాలలను ఏర్పాటు చేసింది. నగరంలోని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్ల దగ్గరే కాకుండా ఎంజీబీఎస్‌ బస్సు డిపో వంటి ప్రాంతాల్లోనూ అమ్మకం కేంద్రాలు నెలకొల్పింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలు పరిధిలో 60, చర్లపల్లి జైలు పరిధిలో 50 ఔట్‌లెట్లు ఉండగా, ఇటీవల విక్రయాలను రాష్ట్రమంతటా 750 ఔట్‌లెట్లకు విస్తరించామని జైళ్ల శాఖ ఇన్‌ఛార్జి ఐజీ సైదయ్య శనివారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మాజీ సభాపతి కోడెలపై కేసు

రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ క్రికెట్‌ క్రీడాకారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్‌లపై కేసు నమోదు చేశామని నరసరావుపేట రెండో పట్టణ సీఐ ఆళహరి శనివారం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. రూ. 4 కోట్ల భూమి దానం 

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు పెనుమంట్ర మండలం గర్వులో ప్రవాస భారతీయ మహిళ పడాల కస్తూరి 1.10 ఎకరాల భూమిని ప్రభుత్వానికి విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు. మార్కెట్‌ రేటు ప్రకారం దీని విలువ సుమారు రూ.4 కోట్లు ఉండొచ్చునని అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మావోయిస్టుల వద్ద పాకిస్థాన్‌ ఆయుధం

పాకిస్థాన్‌ సైన్యం వినియోగించే ఆయుధాలు మావోయిస్టుల వద్ద లభ్యమయ్యాయని ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మల్కాన్‌గిరి జిల్లా సరిహద్దులోని ముర్నాడ్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనలో మావోయిస్టు శిబిరం నుంచి మా బలగాలు నాలుగు తుపాకీలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిలో ఒకటి పాకిస్థాన్‌ సైన్యం వినియోగించే జి-3 తుపాకిగా గుర్తించాం. దీంతో ఐఎస్‌ఐతో మావోయిస్టులకు సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మిస్‌ ఇండియా.. రాజస్థాన్‌ అమ్మాయే!

ఈ ఏడాది మిస్‌ ఇండియా ఎవరా అన్న ఉత్కంఠకు తెరపడింది. రాజస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల సుమన్‌ రావు ఫెమీనా మిస్‌ ఇండియా - 2019 అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది మిస్‌ ఇండియాగా నిలిచిన తమిళనాడుకు చెందిన మాజీ మిస్‌ ఇండియా అనుకీర్తి వాస్‌..ఈ కిరీటాన్ని సుమన్‌ రావుకి తొడిగారు. తొలి  రన్నరప్‌గా చత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్‌ నిలిచారు. సెకండ్‌ రన్నరప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్‌ నిలిచారు. మిస్‌ ఇండియా యూనైటెడ్‌ కాంటినెంట్స్‌ 2019 కిరీటాన్ని బిహార్‌కు చెందిన శ్రేయా శంకర్‌ కైవసం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘టీ-సిరీస్‌’కు గిన్నీస్‌ రికార్డు

యూట్యూబ్‌లో 10 కోట్ల మంది ఖాతాదారులు (సబ్‌స్కైబ్రర్స్‌) కలిగిన ఛానెల్‌గా ‘టీ-సిరీస్‌’ నిలిచింది. ఈమేరకు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఖాతాదారులను సంపాదించుకున్నందుకు గాను ‘గిన్నీస్‌’ ప్రతినిధి చేతుల మీదగా శుక్రవారం టీ-సిరీస్‌ ఎండీ భూషణ్‌ కుమార్‌ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. జ్యోతి సురేఖ కొత్త చరిత్ర

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగంలో కాంస్యం గెలిచిన భారత తొలి మహిళగా నిలిచిన ఆమె టీమ్‌ విభాగంలోనూ కంచు పతకం సాధించింది.  వ్యక్తిగత విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సురేఖ 10-9 (షూటాఫ్‌) తేడాతో ప్రపంచ రెండో ర్యాంకు ఆర్చర్‌ బోస్టన్‌ (టర్కీ)పై విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.