close

తాజా వార్తలు

బడి మరుగుదొడ్డిలో ఆరడుగుల పాము

ఆత్మకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆరడుగులున్న తాచుపాము పాఠశాల మరుగుదొడ్డిలోకి దూరింది. లోనికి ప్రవేశించగానే తలుపు మూసుకుపోవడంతో బయటకు రాలేకపోయింది. అందులో నుంచి శబ్దాలు వస్తోండడంతో స్థానికులు వచ్చి తలుపు తీశారు. ఒక్కసారిగా జనాన్ని చూసిన ఆ పాము పారిపోయేందుకు యత్నించింది. దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్న వెంటిలేటర్‌ రంధ్రం నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించింది. సగం వరకూ దూరింది. లావుగా ఉన్నందున పూర్తిగా బయటకు రాలేక ఇరుక్కుపోయి చివరికి చనిపోయింది. ఈ ఉదంతం నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, కరటంపాడు ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.