close

తాజా వార్తలు

అసలు ఎవరీ సుమన్‌ రావు?

మిస్‌ ఇండియా-2019 కిరీటం గెలుచుకుని దేశ ప్రజల చూపు తనవైపునకు తిప్పుకున్న ముద్దుగుమ్మ సుమన్‌ రావు. ఈ అందగత్తె అసలు పేరు సుమన్‌ కన్వార్‌ రావు. 1999 నవంబరు 23న రాజస్థాన్‌లోని రాజసమంద్‌ ప్రాంతంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి రతన్‌ సింగ్‌ రావు వ్యాపారవేత్త. సుమన్‌ పుట్టింది రాజస్థాన్‌లోనే అయినా ముంబయిలో పెరిగారు. మహాత్మా ఎడ్యుకేషనల్‌ సొసైటీలో విద్యను అభ్యసించారు. న్యూదిల్లీలో ఓ పక్క ఛార్టెర్డ్‌ అకౌంట్‌ కోర్సు చేస్తూ, మరోపక్క బీకామ్‌ అభ్యసిస్తున్నారు. అంతేకాదు ఆమె కథక్‌ డ్యాన్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు.

బ్యూటీ 2019లో ‘మిస్‌ ఇండియా రాజస్థాన్‌’ టైటిల్‌ గెలుచుకున్నారు. శనివారం ముంబయిలోని సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన అందాల పోటీలో విజేతగా నిలిచి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు ఇదే మిస్‌ ఇండియా పోటీల్లో ఆమె ‘మిస్‌ ర్యాంప్‌వాక్‌’ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు డిసెంబరులో బ్యాంకాక్‌లో జరగనున్న ‘మిస్‌ వరల్డ్‌ 2019’ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొనబోతున్నారు.

మిస్ ఇండియా పోటీల్లో సుమన్‌ లింగ వివక్షత గురించి మాట్లాడారు. ‘లింగ వివక్షత ఉన్న వర్గం నుంచే నేనూ వచ్చా. ఇప్పటికే ఉన్న షరతులను అనుసరించాలి, లేదా ఈ పద్ధతిని మార్చే బాధ్యత తీసుకోవాలనే రెండు అంశాలను నా ముందు ఉంచితే నేను రెండోది ఎంచుకుంటాను’ అని చెప్పారు.

సుమన్‌ మిస్‌ ఇండియా వేదికపై తన అందంతోనే కాకుండా నృత్యం తోనూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై డ్యాన్స్‌ చేస్తున్న ఫొటోను ఆమె కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ అవకాశం తనకు ఇచ్చిన మిస్‌ ఇండియా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. సుమన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 30.6 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె 2017 నవంబరు 23న తొలి పోస్ట్‌ చేశారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.