
తాజా వార్తలు
పరిచయం పేరిట నంబరు తీసుకున్న నిందితుడు
హైదరాబాద్: ఆమె గృహోపలంకరణ డిజైనర్.. నగరంలోని ఒక ప్రధాన ప్రాంతంలో నివాసముంటున్నారు.. వృత్తిరీత్యా ప్రైవేటు సంస్థలు.. మహిళలు.. యువతులతో పరిచయం.. తన డిజైన్లకు ప్రచారం లభించాలన్న ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో ఖాతాలు ప్రారంభించి కొత్త డిజైన్లను పోస్ట్ చేస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ఓ సాఫ్ట్వేర్ సంస్థకు ప్రతినిధిగా ఉన్న వర్మ(పోలీసులు పేరు మార్చారు) ఫోన్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. దక్షిణ భారతదేశంలో ఉన్న తమ సంస్థ కార్యాలయాల్లో అలంకరణలు చేయాలని కోరాడు. తన ఉన్నతాధికారులతో మాట్లాడతానని, వివరాలు ఫోన్లో చెబుతానంటూ ఆమె చరవాణి నంబరు తీసుకున్నాడు. రెండు రోజుల తర్వాత ఆమె వివరాలు, చరవాణి నంబరును డేటింగ్ వెబ్సైట్లలో పోస్ట్ చేశాడు. మూడు గంటల అనంతరం ఆమెకు వరుసగా ఫోన్లు వచ్చాయి. డేటింగ్ సైట్లో మీ చరవాణి నంబరు ఉంది... ఎక్కడికి రమ్మంటారు? అన్న ప్రశ్నలతో పాటు అసభ్యంగా మాట్లాడారు. ఒక్కసారిగా హతాశురాలైన ఆమె ఫోన్ నంబరు ఎవరిచ్చారంటూ ప్రశ్నించగా... రెండు డేటింగ్ సైట్లలో మీ వివరాలున్నాయంటూ చెప్పారు. వెంటనే ఆమె ఫోన్ ఆపేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అపరిచితులకు చరవాణి నంబరు, వివరాలు చెప్పవద్దంటూ పోలీస్ అధికారులు ఆమెకు వివరించారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
