
తాజా వార్తలు
పంజాగుట్ట(హైదరాబాద్): నగరంలోని పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు గతంలో కొందరు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం లారీలో అంబేడ్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్లీ అదే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ సంఘాల నాయకులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వీహెచ్, హర్షకుమార్‌తో పాటు అంబేడ్కర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షుడు గుడిమల్ల వినోద్‌కుమార్‌ను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నేతల అరెస్టు సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేడ్కర్ విగ్రహంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
