close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9AM

1. మాజీ ఎంపీలు వీహెచ్‌, హర్షకుమార్‌ అరెస్టు

హైదరాబాద్‌లోని పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, హర్షకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు గతంలో కొందరు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం లారీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్లీ అదే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ నేతలతో పాటు వివిధ సంఘాల నాయకులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పర్మిట్‌రూంల ఎత్తివేత!

మరో మూడు నెలల్లో తెలంగాణలో అమల్లోకి రానున్న కొత్త ఆబ్కారీ విధానంపై అధికారుల కసరత్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న మందు గదులను (పర్మిట్‌ రూంలు) ఎత్తివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే లైసెన్సు ఫీజులో స్వల్ప పెరుగుదల ఉండవచ్చని తెలుస్తోంది. ఇది మినహా కొత్త ఆబ్కారీ విధానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నేడు తెలంగాణ మంత్రిమండలి భేటీ

తెలంగాణ మంత్రిమండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరగనుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ సమావేశాన్ని భారీ ఎజెండాతో నిర్వహించనున్నారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త పంచాయతీరాజ్‌, రెవెన్యూ, పురపాలక చట్టాలను, రోడ్డు భద్రత చట్టాలను ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే పంచాయతీరాజ్‌చట్టం అమలులోకి వచ్చింది. మంగళవారం కొత్త పురపాలక చట్టం, రోడ్డు భద్రత చట్టాలకు ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు వివిధ ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రిమండలి అనుమతిస్తూ తీర్మానాలు చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. సాగుకు 9గంటల విద్యుత్తుపై వారంలోపు ప్రకటన

వ్యవసాయ అవసరాలకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరాలో భాగంగా ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు కేటాయిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. తొమ్మిది గంటల విద్యుత్తుపై వారంలోగా ప్రకటన చేస్తానని సీఎం స్పష్టం చేశారు. ఈలోగా ప్రయోగాత్మక పరీక్షలు పూర్తి చేసి సాంకేతిక లోపాలు సవరించుకోవాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 1 నుంచి కౌన్సెలింగ్‌ 

ఏపీలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ సీట్ల భర్తీకి ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్‌ జారీ కానుంది. జులై 1 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 1నుంచి విద్యార్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపిక ఆప్షన్ల నమోదుకు 4నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. 10న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో జులై 9నాటికి నాలుగో విడత సీట్ల కేటాయింపు పూర్తి కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

6. రెవెన్యూ ప్రక్షాళనకు శ్రీకారం!

తెలంగాణలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి తహసీల్దారు స్థానం వరకు వారు పనిచేసిన, పనిచేస్తున్న, సీనియారిటీతో పాటు పూర్తి వివరాలు తెలపాలంటూ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయం సోమవారం అత్యవసర ఆదేశాలు జారీచేసింది. ఈనెల 20వ తేదీలోగా పూర్తి వివరాలు పంపాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా ఒకేచోట దీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, ఉద్యోగులపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. భూమి నిస్సారమవకుండా కాపాడతాం

భారత్‌లో 29.3% భూమి భూసారక్షయం బారిన పడిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్పారు. అందరి సహకారంతో భూసారక్షయాన్ని అధిగమించేందుకు కృషిచేస్తామని చెప్పారు. భూసారక్షయం, ఎడారీకరణలను అడ్డుకునేందుకు ఐరాస ఎడారీకరణ నివారణ ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో (కాప్‌-14) కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఎండ మండిపోతోంది.. బయటకు రావద్దు

బిహార్‌లో ఎండ తీవ్రతకు మూడు జిల్లాల పరిధిలో గడిచిన మూడు రోజుల్లో 76 మంది మరణించారు. దాంతో రాష్ట్రంలోని గయ పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. విద్యాసంస్థలన్నింటికీ ఈనెల 22 వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాల్పుల కారణంగా ఔరంగాబాద్‌లో 33 మంది, గయలో 31 మంది, నవడాలో 12 మంది మరణించినట్లు విపత్తు నివారణ సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అ.. అమెజాన్‌ ఆ.. ఆకర్షణీయం

దేశంలో అత్యంత ఆకర్షణీయ బ్రాండ్లలో అమెజాన్‌ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా, సోనీ ఇండియాలు నిలిచాయని రాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌(ఆర్‌ఈబీఆర్‌) 2019 నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం 32 దేశాల్లో 2 లక్షల మంది ప్రతినిధులను సర్వే చేయగా.. అమెజాన్‌ ఇండియాకు మంచి మార్కులు పడడంతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక మైక్రోసాఫ్ట్‌ ఇండియా, సోనీ ఇండియా, మెర్సిడెజ్‌-బెంజ్‌, ఐబీఎమ్‌, ఎల్‌ అండ్‌ టీ, నెస్లే, ఇన్ఫోసిస్‌, శాంసంగ్‌, డెల్‌లు టాప్‌-10లో స్థానం దక్కించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. విండీస్‌పై బంగ్లా అద్భుత విజయం

బంగ్లాదేశ్‌ అదరగొట్టింది. షకిబ్‌ అల్‌ హసన్‌ (124 నాటౌట్‌) అదిరే శతకం సాధించిన వేళ వెస్టిండీస్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. షై హోప్‌ (96), లూయిస్‌ (70), హెట్‌మయర్‌ (50) మెరవడంతో మొదట వెస్టిండీస్‌ 8 వికెట్లకు 321 పరుగులు సాధించింది. షకిబ్‌కు తోడు లిటన్‌ దాస్‌ (94 నాటౌట్‌) రెచ్చిపోయిన వేళ.. లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ 41.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.