close

తాజా వార్తలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో ఘనత

విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ మరో ఘనత సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో నెలకొల్పిన ఫోర్జ్‌డ్‌ వీల్ ప్లాంట్‌లో 6.6 కేవీ స్విచ్ బోర్డును విశాఖ ఉక్కు సీఎండీ ప్రదోశ్‌ కుమార్‌ రథ్ మంగళవారం ప్రారంభించారు. ఈ ప్లాంట్‌ భారతీయ రైల్వేకి సంబంధించి ఫోర్జ్‌డ్‌ చక్రాలను తయారు చేయనుంది. ఇందుకోసం ఈ ప్లాంట్‌లో విశాఖ ఉక్కును వినియోగించనున్నారు. 6.6 కేవీ స్విచ్‌బోర్డుతో పాటు రెండు ఎల్‌సీఎస్‌ఎస్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సైతం ఆయన ప్రారంభించారు. ఈ ప్లాంట్ ఆర్‌ఐఎన్‌ఎల్‌(రాష్ట్రీయ ఇస్పత్‌ నిగమ్‌ లిమిటెడ్‌) ఆధ్వర్యంలో సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.